బెల్లంపల్లి మున్సిపాలిటీ 4వ వార్డులో పలు రహదారులు అధ్వానంగా మారాయి.రోడ్లపై అడుగడునా గుంతలు పడి ఇబ్బందులు పడుతున్నామని వార్డు ప్రజలు వాపోతున్నారు. కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు వర్షపు నీరంతా రోడ్డు పైనున్న గుంతల్లో నిలిచి దోమలు వృద్ధి చెందడంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.