మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రము లో స్లేట్ స్కూల్ ఆద్వర్యంలో యువజన దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్కేట్ స్కూల్ విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించగ , విద్యార్థుల తల్లిదండ్రులు, మండల కేంద్రములోని వర్తకులు, యువత బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు స్పూర్తి ప్రదాత , దేశ ప్రతిష్ఠతను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి అయిన స్వామీ వివేకానంద జయంతిని యువజన దినోత్సవం గా జరుపుకోవడం అనందంగా ఉందని అన్నారు.