యువత చదువుతో పాటు ఆటల్లో రాణించాలని బెల్లంపల్లి యువజన
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జాడి రాజ్ కుమార్ అన్నారు. శనివారం తమ పెళ్లి రోజు సందర్భంగా గంగారం గ్రామ యువతకు
క్రికెట్ కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరు తమ ప్రతిభను మెరుగుపర్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాలన్నారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.