బెల్లంపల్లి: యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు
సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం వారు మాట్లాడుతూ బెల్లంపల్లి రీజియన్ కే తలమానికంగా ఉన్న ఆసుపత్రిని వార్డుల కుదింపు, ఇతర సదుపాయాలను ఎత్తివేసి యాజమాన్యం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు.