బెల్లంపల్లి: భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూడాలి
బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నాయకులు కోరారు. షార్ట్ సర్క్యూట్ తో జరిగిన ప్రమాద ఘటనను తెలుసుకొని శుక్రవారం ఆ కమిటీ నాయకులు ఆసుపత్రిని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి సూపర్డెంట్ మధుకర్ తో మాట్లాడారు. పెద్ద ప్రమాదాలు జరగక ముందే అప్రమత్తమైన చర్యలు తీసుకోవాలని సూచించారు