24న జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు

61చూసినవారు
24న జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు
ఈనెల 24న అండర్-14, 17 విభాగాల్లో బాలబాలికలకు టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి ఫణిరాజా తెలిపారు. జైపూర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు హాజరుకావాలని, 01-01-2008 ( అండర్ -17), 01-01-2011 ( అండర్ -14) తర్వాత జన్మించిన వారు అర్హులని సూచించారు.

సంబంధిత పోస్ట్