జైపూర్: కాంగ్రెస్ నాయకుల బాహాబాహీ

60చూసినవారు
అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన లో భాగంగా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే వివేక్ ఎదుటే బుధవారం కాంగ్రెస్ నాయకులు బాహాబాహీకి దిగడంతో కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బయటపడింది. శంకుస్థాపనకు వ్యక్తిగతంగా తమను పిలవడం లేదని ఓవర్గం ఎమ్మెల్యే ఎదుట గొడవకు దిగారు. మాటల దాడి తీవ్రంగా కాగా పరిస్థితి చేయి దాటి పోయే వరకు రావడంతో పోలీసులు జోక్యం చేసుకొని గొడవను సద్దుమణిగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్