మందమర్రిలోని మార్కెట్ సెంటర్లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు తొలగించాలని బీఎస్పి చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీ బస్టాండ్ గోడను ఆనుకుని ఉపాధి లేక పాన్ టేలలు వేసుకుంటే వాటి తొలగించారని ఇది సరైనది కాదన్నారు. ఎదురుగా ఉన్న పలు షాపుల యజమానులు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.