జన్నారంలో 132 కేవి సబ్ స్టేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని జన్నారం మండల ఆటో మొబైల్ యూనియన్ అధ్యక్షులు హరికృష్ణ డిమాండ్ చేశారు. జన్నారం మండలానికి చెందిన సామజిక కార్యకర్త శ్రీరాముల భూమచారి గత 20 రోజుల నుండి రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన చేస్తున్న దీక్షకు మద్దతుగా శనివారం జన్నారం మండలానికి చెందిన ఆటోమొబైల్ యూనియన్ మద్దతు తెలిపింది.