శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ ఓసిపి ఓబిలో పనిచేస్తున్న కార్మికుల పట్ల మొండిగా వ్యవహరిస్తున్న సిఆర్ఆర్ కాంట్రాక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులకు సరైన మాస్టర్లు ఇవ్వకుండా ఇతర పనులు చేయాలంటూ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.