చెరువును కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

57చూసినవారు
చెరువును కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
చెన్నూర్ పట్టణంలోని ఆస్నాద్ రోడ్ లో ఉన్న పంచముఖి హనుమాన్ చెరువును కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుమ్మిడి గోపాల్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గతకొంత కాలంగా చెరువు భూమిలో అక్రమంగా భవనాలు నిర్మించారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి భవనాలను తొలగించి, చెరువు భూమి కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్