మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవ పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, చిత్రలేఖనం, డ్రాయింగ్, ఉపన్యాసం, నృత్యం, గానం, మొదలైన అంశాలలో పోటీలు జరిగాయి. జిల్లాలోని 95 పాఠశాలల నుండి 77 మంది బాలురు 102 మంది బాలికలు పాల్గొన్న ఈ పోటీల్లో ఇద్దరిని గుజరాత్ లోని వాద్ నగర్ లో నిర్వహించబోయే 7 రోజుల శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేశారు.