నస్పూర్ లో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

56చూసినవారు
నస్పూర్ లో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడిని నిరసిస్తూ శుక్రవారం హైదారాబాద్ లో బీఆర్ఎస్ ధర్నా తలపెట్టిన నేపథ్యంలో నస్పూర్ లో పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు దగ్గుల మధు కుమార్, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు కాటంరాజు, పట్టణ ఉపాధ్యక్షులు కందుల ప్రశాంత్, జాయింట్ సెక్రెటరీ మొహమ్మద్ సాజిద్ లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్