మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజుగూడ పంచాయతీ పరిధిలోని జైతుగూడకు చెందిన మర్సుకోళ్ల లింగు పటేల్ మంగళవారం సాయంత్రం వారి స్వగృహంలో మృతి చెందాడు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కంది సతీష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతుని భార్య మర్సుకోళ్ల అంబు భాయ్ కి తక్షణ అవసరాల నిమిత్తం 3000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షులు కన్నక జంగు, తదితరులు పాల్గొన్నారు.