78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి జాతీయ జెండా ఎగురవేసి మిఠాయిలు పంచి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మండలంలో లింగాపూర్ గ్రామానికి చెందిన ధావుల రంగాజీ (30)వారం రోజుల క్రితం మరణించగా అంబేద్కర్ సంఘం సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.