మంచిర్యాలలో గోరింటాకు సంబరాలు

58చూసినవారు
ఆషాఢమాసం పురస్కరించుకుని గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో మహిళలు గోరింటాకు సంబరాలు నిర్వహించారు. లలిత గోవింద పారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని ఉల్లాసంగా గడిపారు. తెలుగు సంప్రదాయాలను భావి తరాలకు తెలిపేందుకు ఈ వేడుక నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్