వికారాబాద్ జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులపై జరిగిన దాడులను ఖండిస్తూ తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు గురువారం జైపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట అధికారులు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వనజా రెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు మాట్లాడుతూ ప్రజల్లో భాగమైన ఉద్యోగులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.