రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పూర్తయ్యాక జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ కేటాయించాని బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు ఒడ్డెపల్లి మనోహర్ కోరారు. మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పేరిట 5 శాతం లేని అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.