సింగరేణిలో పదవి విరమణ పొందిన కార్మికులకు దీపావళి బోనస్, లాభాల్లో వాటా ఇవ్వాలని బుధవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సంస్థ డైరెక్టర్ (పా) వెంకటేశ్వర రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ. కృష్ణ మాట్లాడుతూ సుదీర్ఘ కాలం కంపెనీలో పనిచేసి బొగ్గు ఉత్పత్తి, లాభాలకు కారణమైన వారి సేవలను గుర్తించక పోవడం సరికాదన్నారు. దీనిపై డైరెక్టర్ స్పందించినట్లు తెలిపారు.