మందమర్రి: ఐఎన్టీయూసీ మున్సిపల్ అధ్యక్షునిగా మూటిక రవియాదవ్

51చూసినవారు
మందమర్రి: ఐఎన్టీయూసీ మున్సిపల్ అధ్యక్షునిగా మూటిక రవియాదవ్
ఐఎన్టీయూసి క్యాతనపల్లి మున్సిపాలిటీ అధ్యక్షునిగా రామకృష్ణాపూర్ పట్టణంలోని మల్లికార్జున నగర్ కు చెందిన మూటిక రవియాదవ్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు రాంశెట్టి నరేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్, ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ చేతుల మీదుగా రవియాదవ్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎన్టీయూసీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్