మంచిర్యాల జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో జైపూర్ ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ, పంచాయతీల్లో నిధుల కొరతతో కార్యదర్శులు ఖర్చు చేస్తున్న సొంత డబ్బులు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ప్రతి నెల వేతనాలు చెల్లించాలని కోరారు.