మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదాపూర్ లో నిరుపేద కుటుంబానికి చెందిన మూటపల్లీ వెంకట నర్సయ్య (65) అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యం తో మృతి చెందారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు వీరిది నిరుపేద కుటుంబం అని కనీస ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయాలని ఏఐసీసీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జి కోక్కిరాల ప్రేమ్ సగారావు దృష్టికి తీసుకెళ్లగా విషయం పై వెంటనే స్పందించిన ప్రేమ్ సాగర్ రావు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
ఈ ఐదు వేల రూపాయల నగదును జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం త్రిమూర్తి మృతుని కుటుంబ సభ్యులకు ఆదివారం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు, మ్యాదరిపేట ఎంపీటీసీ సభ్యులు కొంగల నవీన్ కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు చొప్పదండి రాజేష్, మంతెన రాజేందర్, బలుసు వినోద్, పెంచాల సతెన్న, పుల్ల శ్రీనివాస్, శైలేందర్, తదితరులు పాల్గొన్నారు.