మంచిర్యాల జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఇన్చార్జ్ అధికారిగా జె. అంబాజీ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలోని నస్సూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జె. అంబాజీ ప్రస్తుతం నిర్మల్ జిల్లా గిరిజనాభివృద్ధి అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.