శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ గా సూర్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు స్వీకరించి అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీరాంపూర్ ఏరియాలో బొగ్గు ఉత్పత్తి, ఇబ్బందులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జిఎం సంజీవరెడ్డి, సెక్యూరిటీ అధికారి జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.