ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని జన్నారం ఎంఈఓ విజయ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వ పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయుడు లావుడియా చందూలాల్ పదవి విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చందులాల్ దంపతులకు శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ వినయ్ కుమార్ పాల్గొన్నారు.