కార్మికులకు యాజమాన్యం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి

75చూసినవారు
కార్మికులకు యాజమాన్యం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి
సింగరేణి వ్యాప్తంగా ఈ నెల. 18 నుండి. 21 వరకు నిర్వహించనున్న ఈపీ ఆపరేటర్ డ్రైవింగ్ టెస్టుకు హాజరయ్యే కార్మికులకు యాజమాన్యం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఐఎన్టీయూసి శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జె. శంకర్ రావు సోమవారం కోరారు. గతంలో డ్రైవింగ్ నేర్చుకున్న కార్మికులు ప్రస్తుతం గనులలో పనిచేస్తున్నందున శిక్షణకు దూరంగా ఉన్నారని తెలిపారు. వెంటనే యాజమాన్యం వీటీసీలో కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్