జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా కొత్త వెంకటేశ్వర్లు

72చూసినవారు
జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా కొత్త వెంకటేశ్వర్లు
మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా కొత్త వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారి గంప శ్రీనివాస్, పరిశీలకులు ఐత రత్నాకర్ సమక్షంలో జరిగిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ధ్రువీకరణ పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అమరవాది అందించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్