మంచిర్యాల జిల్లా కేంద్రంలో ని హైటెక్ సిటీలో మంచిర్యాల క్లబ్ లో సెప్టెంబర్ 21న జోనల్ స్థాయి బ్యాడ్మింటన్ బాలబాలికల అండర్ 14, 17, 19 పోటీలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఫణి రాజా, కాలేజ్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ బాబురావు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు అదే రోజున ఉదయం 9 గంటలకు క్లబ్ లో రిపోర్ట్ చేయాలని వారు సూచించారు.