అన్‌స్టాపబుల్ సీజన్-4లో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన పెద్ద కుమార్తె బ్రాహ్మణి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. "మణిరత్నం అప్పట్లో ఓ సినిమా కోసం బ్రాహ్మణిని హీరోయిన్‌గా అడిగారు. ఆ విషయాన్ని ఆమెకు చెబితే.. ‘మై ఫేస్’ అని సమాధానమిచ్చింది. నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని అన్నా. చివరకు ఆసక్తి లేదని చెప్పా. నేను భయపడేది బ్రాహ్మణికే." అని బాలకృష్ణ పేర్కొన్నారు.