డబుల్ ఇస్మార్ట్‌లోని మార్ ముంతా ఛోడ్ చింతా సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దీనిపై స్పందించారు. 'ఇస్మార్ట్ శంకర్‌లో దిమాక్ ఖరాబ్ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సీక్వెల్‌లో అంతకు మించి ఉండాలనే ఉద్దేశంతో మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ చాలా కష్టపడ్డారు. ఇస్మార్ట్ శంకర్‌లో మార్ ముంతా ఛోడ్ చింతా డైలాగ్ ఉంది. దాన్నే లీడ్‌గా తీసుకుని పాటను రూపొందించాం' అని తెలిపారు.