పారిస్ ఒలింపిక్స్‌లో మూడో రోజు ఆఖర్లో మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి మనిక బత్రా విజయం సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రితిక పవడేపై మనిక 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో గెలుపొంది, రౌండ్ ఆఫ్ 16కు చేరింది. ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో రౌండ్ ఆఫ్ 16కు క్వాలిఫై అయిన తొలి భారత పాడ్లర్‌గా మనిక చరిత్ర సృష్టించింది.