దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అన్ని రకాల కార్ల ధరలపై 4శాతం పెంచుతున్నట్లు తెలిపింది. పెరిగిన ధరలు జనవరి 2025 నుంచి అమలులోకి రానున్నాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల వల్ల మారుతీ కార్ల ధరలను పెంచడం జరిగింది. అయితే మోడల్ వారీగా ధరల పెంపును గురించి కంపెనీ ఇంకా పేర్కొనలేదు.