చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు.. రోడ్డుపై ఎటూ వెళ్తున్నామో తెలియదు. తాజాగా అలాంటిదే ఒక వీడియో నెట్టింట వైరలవుతుంది. బైక్‌లో పెట్రోల్ కొట్టించేందుకు పెట్రోల్ బంక్‌కు భార్యభర్తలిద్దరూ వచ్చారు. ఈ క్రమంలో భార్య ఫోన్‌లో మాట్లాడుతూ బైక్ దిగి కొంచెం దూరంగా వెళ్లింది. ఈ క్రమంలో వేరే అతను బైక్‌లో పెట్రోల్ కొట్టించుకొని వెళ్తుంటాడు. సదరు మహిళ అతని బైక్ ఎక్కి వెళ్లిపోతుంది. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. నెట్టింట వైరలవుతోంది.