టీడీపీ మార్ఫింగ్ చేస్తే చర్యలు తీసుకోరా?: అంబటి

85చూసినవారు
AP: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. టీడీపీ సోషల్ మీడియాపై పోలీసులు చర్యలు తీసుకోవాలని.. లేదంటే కోర్టులను ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. 'మాజీ సీఎం జగన్ ఫోటోలను టీడీపీ మార్ఫింగ్ చేసిందని, జగన్‌తో పాటు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు మార్ఫింగ్ చేస్తే తప్పు లేదా? ఆర్జీవీ ఏదో ఫోటో మార్ఫింగ్ చేశారని ఆయన వెంటపడ్డారు. మీకేనా మనోభావాలు దెబ్బతినేది.. మాకు తినవా? అని అంబటి ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్