అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

76చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామిక వాడలోని అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ఎంబీ-2 బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. అయితే రియాక్టర్లలో సాల్వెంట్ మిక్సింగ్ జరుగుతుండగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్