కేరళలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని వివిధ కొండ ప్రాంతాల్లో ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు సమాచారం. కేరళ విపత్తు నిర్వహణ సంస్థ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగానే కొండ చరియలు విరిగిపడినట్లు భావిస్తున్నారు.