ఒకే ఇంట్లో నలుగురికి ఎంబీబీఎస్‌ సీట్లు

61చూసినవారు
ఒకే ఇంట్లో నలుగురికి ఎంబీబీఎస్‌ సీట్లు
సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం- శారద దంపతుల నలుగురు కుమార్తెలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీట్లు పొందారు. పెద్ద కుమార్తె మమత 2018లో ఎంబీబీఎస్‌ సీట్ పొంది చదువు పూర్తి చేసి డాక్టర్ అవ్వగా.. రెండో కుమార్తె మాధవి 2020లో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొంది చదువుతుంది. ఈ సంవత్సరం మరో ఇద్దరు కుమార్తెలు రోహిణి, రోషిణి ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారు. నలుగురు ఎంబీబీఎస్‌ సీట్లను పొందడం గర్వంగా ఉందని, తల్లిదండ్రుల కలలను సాకారం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు పిల్లలను అభినందించాడు.

సంబంధిత పోస్ట్