గట్టు పంచాయతీలో వ్యక్తిని కట్టేసి కొట్టారు!
నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో ఇరువర్గాల మధ్య గట్టు పంచాయతీ తలెత్తింది. మాటా మాటా పెరిగి ఘర్షణ జరగడంతో ఒకరి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరొకరిని రేకుల షెడ్డు పైపుకు తాడుతో కట్టేసి కొట్టినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న కుల్చారం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.