గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఆదివారం దారుణం జరిగింది. పల్సానా తాలూకాలోని ఓ గ్రామంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికను 45 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ చేశాడు. తన గదికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. ఆమె జననాంగాల నుంచి రక్తం కారుతుండడాన్ని పేరెంట్స్ గమనించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.