పెళ్లి ఊరేగింపుపైకి దూసుకెళ్లిన కారు (వీడియో)

83చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. వివాహం సందర్భంగా రోడ్డుపై ఊరేగింపు జరుగుతోంది. పెళ్లికి వచ్చిన అతిథులు పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ లగ్జరీ కారు వేగంగా దూసుకొచ్చింది. ఊరేగింపులో ఉన్న పలువురిని ఆ కారు ఢీకొట్టింది. ఆగకుండా ముందుకు వెళ్లి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్