కారులోనే వ్యక్తి సజీవదహనమైన ఘటన ఢిల్లిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అనిల్ (24) అనే యువకుడు తూర్పు ఢిల్లీలోని గాజీపూర్‌లో తన ప్రియురాలు పెళ్లి జరుగుతుండగా కారులో వెళ్లాడు. ఈ క్రమంలో యువకుడి కారుకు ఒక్కసారిగా మంటలు అంటుకొని ఆ మంటల్లోనే కాలిపోయాడు. యువకుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే అమ్మాయి తరపు వాళ్లే అనిల్‌ను హత్య చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.