ఏడుపాయల వనదుర్గా మాతను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శంకర్ శర్మ, పార్థివ శర్మ, రాము శర్మ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నామన్నారు. విజయదశమి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు వివిధ అలంకరణలతో దర్శనం ఇస్తారన్నారు.