వ్యవసాయ పొలం మధ్యలో ప్రమాద కరంగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను రోడ్ దగ్గరకు మార్చడానికి విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్లు 1లక్ష 70 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. రైతులు ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ నరసింహారెడ్డి కి తెలుపగా, వెంటనే స్పందించి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, పై అధికారులతో మాట్లాడి ఖర్చు లేకుండా మార్చడం జరిగింది. దీనికి సహకరించిన ఎమ్మెల్సీ, జెడ్పిటిసి కి గ్రామ రైతులు శనివారం కృతజ్ఞతలు తెలిపారు.