నిజామాబాద్ స్థానిక సంస్థల అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొందిన కల్వకుంట్ల కవిత గురువారం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా తమ వంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మెదక్ ఎమ్మెల్సీ కెసిఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్రెడ్డి శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందజేశారు.