ఆర్థిక మంత్రి హరీష్ రావు బుధవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి మెదక్ పట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మెదక్,హవేళి ఘణపూర్ మండలాలకు చెందిన లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 11:30 గంటలకు ఎంపీడీఓ కార్యాలయంలో ఎస్సీ కార్పోరేషన్ కు సంబంధించిన చెక్కులను అందజేయనున్నారు.