మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం రామాయంపేటలో టీపీసీసీ సభ్యుడు చౌదరి సుప్రభాత రావు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. వర్షానికి దెబ్బతిన్న ఇళ్లు, చెరువులు కుంటలు, పలు బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో పూర్తి వివరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, వాటిని పునరుద్ధరించడం కోసం ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తారన్నారు.