మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులకు నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. జూలై 2023 నుంచి నూతన చట్టాలు అమల్లోకి వచ్చినందున వాటిపై అవగాహన పెంచుకొని ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నూతన చట్టాలపై పోలీసులు అవగాహన కలిగి ఉండాలన్నారు.