కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసనగా ఈనెల 31న కాంగ్రెస్ నేతలు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలోని డిసిసి కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు నిరసన దీక్ష కార్యక్రమం చేపడుతున్నట్లు మెదక్ జిల్లా అధ్యక్షులు కంట తిరుపతిరెడ్డి తెలిపారు. జిల్లాలోని యువజన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.