మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని చీలాపల్లి గ్రామానికి చెందిన మహిళా కండక్టర్ గౌరమ్మ(45) ఉస్మానియా లో చికిత్స పొందుతూ మృతి చెందింది. నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో లో కండక్టర్ గా పనిచేస్తున్న గౌరమ్మ గత నెల 27న స్వగ్రామం నుండి నారాయణఖేడ్ కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ పై నుండి కింద పడగా తలకు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్ళిపోయింది. ఉస్మానియా లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.