మెదక్ జిల్లా రామాయంపేట దగ్గర శివునూర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం వర్షంలో ఆగివున్న సూపర్ డీలక్స్ బస్సును వెనుక నుండి మూడు కార్లు ఒకదాని వెనుక ఒకటి వచ్చి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయట పడినట్లు తెలిసింది. ప్రమాదంలో మూడు కార్ల ముందు భాగాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.